న‌గ‌దు విడుద‌ల‌కు అప్పిలేట్ క‌మిటి ఏర్పాటు

Date:09/11/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
హైద‌రాబాద్ జిల్లాలో ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ స‌ర్వే టీమ్‌లు స్వాధీనం చేసుకున్న న‌గ‌దును త‌గు విచార‌ణ జ‌రిపి సంబంధిత వ్య‌క్తుల‌కు అంద‌జేయడానికై హైద‌రాబాద్ జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి అప్పిలేట్ క‌మిటిని ఏర్పాటుచేస్తూ హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిషన‌ర్ ఎం.దాన‌కిషోర్ ఉత్త‌ర్వులు జారీచేశారు.   ప్ర‌స్తుత శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని అమ‌లు చేయ‌డానికి ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ స‌ర్వే టీమ్‌లు, వీడియో స‌ర్వేలెన్స్ బృందాల‌ను ప్ర‌త్యేకంగా హైద‌రాబాద్ జిల్లాలో నియ‌మిస్తూ ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ జారీచేసిన విష‌యం విదిత‌మే. ఈ ప్ర‌త్యేక బృందాల త‌నిఖీలో స్వాధీనం చేసుకున్న డ‌బ్బు, ఇత‌ర వ‌స్తువుల‌కు సంబంధించి వీటిలో నిబంధ‌న‌ల ప్ర‌కారం నిజాయితిగా వ్య‌క్తుల‌కు చెందిన‌ట్లైతే వాటిని ప్ర‌త్యేకంగా విచారించ‌డానికి ఈ క్రింది స‌భ్యుల‌తో జిల్లా స్థాయిలో అప్పిలేట్ క‌మిటిని ఏర్పాటు చేస్తూ దాన‌కిషోర్ ఆదేశాలు జారీచేశారు. క‌మిటీ స‌భ్యులుగా హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి టి.పూర్ణ‌చ‌ద‌ర్‌రావు, కూక‌ట్‌ప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ జె.శంక‌ర‌య్య‌, హైద‌రాబాద్ జిల్లా ట్రెస‌రి అధికారి డి.యాద‌గిరి, జీహెచ్ఎంసీ కార్యాల‌యం చీఫ్ ఫైనాన్షియ‌ల్ అడ్వైజ‌ర్ వెంకటేశ్వ‌ర్‌రెడ్డిల‌ను నియ‌మించారు.
Tags; Establishment of the Appellate Committee for Cash Release

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *