Natyam ad

ఈటెల వర్సెస్ రఘునందన్

మెదక్ ముచ్చట్లు:

ఇద్దరు నేతలు ఆ పార్టీలో సీనియర్స్, కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఎంపీ సీట్ పై దృష్టి సారించారు. ఎంపీగా అయిన పోటీచేసి గెలవాలని తహ తహలాడుతున్నారు. అయితే ఆ ఇద్దరు నేతలు ఒకే ఎంపీ స్థానం పై కన్నేశారట. ఆ ఎంపీ టికెట్ కోసం ఎవరికి వారు పార్టీ అధిష్టానం వద్ద పైరవీలు మొదలు పెట్టారట.మెదక్ ఎంపీ సీట్‌కి భారీగా డిమాండ్ పెరిగిందని వార్తలు వస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారట. అయితే కమలం పార్టీలో ఇద్దరు సీనియర్ లీడర్లు మాత్రం మెదక్ ఎంపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే పనిలో బిజీగా ఉన్నారట. బీజేపీ పార్టీలో ఉన్న రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ఇద్దరు కీలక నేతలు మెదక్ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్నారట. ఇప్పటికే బీజేపీ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపారట. ఈ ఇద్దరు నేతలు కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఒడిపోయారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ మెదక్ ఎంపీగా పోటీ చేయాలని బలంగా అనుకుంటున్నారట.రఘునందన్ రావు దుబ్బక బీజేపీ అభ్యర్థిగా,ఈటెల రాజేందర్ గజ్వెల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పోయిన చోటనే వెతకాలి అని సామెత ప్రకారం ఎక్కడో ఓడిపోయారో అక్కడే గెలిచి చూపించాలి అని ఈ టికెట్ ఆశిస్తూన్నారట. బీజేపీ పార్టీలో ఇద్దరు సీనియర్ లీడర్లు మెదక్ ఎంపీ టికెట్ అడగడంతో బీజేపీ అధిష్టానం కూడా కొంత అయోమయంలో పడిందట. ఎవరికి ఇవ్వాలో అర్ధం కాక తలలు పట్టికుంటున్నారట బీజేపీ పార్టీ పెద్దలు. ఈటెల రాజేందర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేసి ఓటమి పాలైన నేపథ్యంలో, తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని, అక్కడి నుంచి గెలిచి చూపిస్తానని చెబుతున్నారని తెలుస్తోంది.ఇక రఘునందన్ కూడా గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈసారి తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఈ ఇద్దరు నేతలు ఇలా టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలియగానే, మెదక్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గల బీజేపీ సీనియర్ లీడర్ల్ రహస్య సవేశం ఏర్పాటు చేసుకున్నారట. ఎంపీ ఎన్నికల్లో కొత్త వారికి టికెట్ ఇవ్వాలని, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు ఎంపీ టికెట్ ఇవ్వద్దు అని తీర్మానం చేసుకున్నారట.ఈ తీర్మానాన్ని పార్టీ పెద్దలకు కూడా ఇచ్చారట. ఇక రఘునందన్ రావు ఒక అడుగు ముందుకు వేసి తనకు మెదక్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. మీరు నాకు సపోర్ట్ చేయాలని కొంతమంది పార్టీ నేతలకు ఫోన్లు చేసి మరీ చెబుతున్నారట. ఈ విషయం తెలుసుకున్న ఈటెల రాజేందర్ కూడా తన ప్రయత్నాలను ఇంకా స్పీడప్ చేశారని సమాచారం.

 

Post Midle

Tags: Etela vs. Raghunandan

Post Midle