పుంగనూరు మున్సిపాలిటికి ఏపిగ్రీన్‌ అవార్డు

Eugreen Award for Punganur Municipality

Eugreen Award for Punganur Municipality

– సిఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఏఈ

Date:15/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

మొక్కల పెంపకం , సంరక్షణ పోటీల్లో పుంగనూరు మున్సిపాలిటిలో ఏపి గ్రీన్‌ అవార్డు అందుకుంది. పచ్చదనం , మొక్కల పెంపకం, పరిశుభ్రత అంశాల్లో పుంగనూరు మున్సిపాలిటి ఏటా గుర్తింపు పొందుతున్న విషయం తెలిసిందే. 2016-2017 సంవత్సరాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ పట్టణంలో 90 వేల మొక్కలను పంపిణీ చేశారు. స్వయం సహాయ సంఘ సభ్యులను, విద్యార్థులను భాగస్వామ్యులను చేయడంతో కార్యక్రమాలు విజయవంతమైయ్యాయి. ప్రైవేటు , ప్రభుత్వ పాఠశాలలు, కాలేజిలు, కాలనీలు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్లాస్టిక్‌ ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి ముందు అల్లనేరేడు, ఉసిరి, జామ మొక్కలను నాటించి సంరక్షణలో ఇళ్ల యజమానులను భాగస్వామ్యులను చేశారు. అలాగే పట్టణలోని పది వాటర్‌ ట్యాంకులు, నీటి సంపుల ప్రాంతాలను శుభ్రం చేయించి, అరటి, మామిడి, ఉసిరి, టమోటా, బెండ, వంగ తదితర మొక్కలు నాటించి సంరక్షించారు. కొత్తఇళ్ల కాలనీ, బీడికాలనీ, ఎన్‌ఎస్‌.పేట, శుబారాం డిగ్రీ కళాశాల, మున్సిపల్‌ కార్యాలయం, పలు పాఠశాలల్లో నాటించి, వెహోక్కలు పెరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ప్రతి శనివారం మున్సిపల్‌ కార్మికులు ట్రీగార్డులు తనిఖి చేయడం, మొక్కల వద్ద కలుపుతీసి పాదులు ఏర్పాటు చేయడం, ట్యాంకర్లతో నీరు పట్టడం తదితర చర్యలు చేపట్టారు. ఏపి గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పోరేషన్‌ రాష్ట్రంలోని 15 కార్పోరేషన్లు , 95 మున్సిపాలిటిలకు గ్రీన్‌ అవార్డుల నిమిత్తం పోటీలు నిర్వహించింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటి ప్రథమస్థానం, పుంగనూరు మున్సిపాలిటి ద్వితీయ స్థానం, బొబ్బిలి మున్సిపాలిటి తృతీయస్థానాలు దక్కించుకున్నట్లు ఏపి గ్రీనింగ్‌ అండ్‌బ్యూటిఫికేషన్‌ కార్పోరేషన్‌ ఎండి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటించారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటి ప్రాంగణంలో శనివారం జరిగిన వనం-మనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అవార్డులను పంపిణీ చేశారు. పుంగనూరు మున్సిపల్‌ క మిషనర్‌ కెఎల్‌.వర్మ తరపున ఏఈ క్రిష్ణకుమార్‌ సిఎం చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు.

15 వేల మొక్కల పంపిణీకి చర్యలు…

పుంగనూరు పట్టణంలో ఈ ఏడాది 15 వేల మొక్కలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ పేర్కొన్నారు. గతంలో మదనపల్లె అటవీశాఖ అధికారులు నుంచి మొక్క రూ.25 ల చొప్పున కొనుగోలు చేశామన్నారు. ప్రభుత్వం అవార్డు అందజేయడంతో ఈ ఏడాది అటవీశాఖాధికారులు మొక్కను రూ.5 చొప్పున అందజేసేందుకు ముందుకురావడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది మహిళా సంఘాలు, మున్సిపల్‌ కార్మికుల ద్వారా ఇంటింటికి వెళ్లి అవసరమైన మొక్కలను అందజేసి అక్కడే నాటిస్తారన్నారు. పుంగనూరు మున్సిపాలిటికి గ్రీన్‌ అవార్డు దక్కడం సంతోషంగా ఉందని, మున్సిపల్‌ చైర్‌పర్శన్‌ , కౌన్సిలర్లు , మున్సిపల్‌ సిబ్బంది, కార్మికులు , అన్నిరాజకీయ పార్టీ నాయకుల సహకారంతో ఈ అవార్డు సాధించామన్నారు.

పుంగనూరు మున్సిపాలిటికి ఏపిగ్రీన్‌ అవార్డుhttps://www.telugumuchatlu.com/eugreen-award-for-punganur-municipality/

Tags; Eugreen Award for Punganur Municipality

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *