టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఈవో ఎవి.ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం
తిరుమల ముచ్చట్లు:
టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత జేఈవో సదా భార్గవి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈవో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం జేఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు లోకనాథం, గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:EV Dharma Reddy sworn in as ex-officio member of TTD
