Natyam ad

పల్స్‌పోలియో లాంఛనంగా ప్రారంభించిన ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల  ముచ్చట్లు:

మార్చి 3వ తేదీ ఆదివారంనాడు దేశవ్యాప్తంగా నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో భక్తులు మరియు స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్య‌క్ర‌మంలో సివిల్ సర్జన్లు డాక్టర్ బి.కుసుమ కుమారి, డాక్టర్ ఎస్.కుసుమ కుమారి, హెడ్ నర్సులు  కృష్ణ కుమారి, సావిత్రమ్మ, ఇతర వైద్య, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags:EV.Dharmareddy formally launched Pulspolio

Post Midle