ఈవ్ టీజింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు

Date:02/12/2019

జగిత్యాల ముచ్చట్లు:

ఈవ్ టీజింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కోరుట్ల ఎస్సై ఆంజనేయులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు సోమవారం కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామ మోడల్ స్కూల్ లో విద్యార్థులకు షీటీం, రోడ్డు భద్రతలపై కళాబృందం సభ్యులతో ఆట పాటలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అసభ్యకరమైన సంఘటనలు ఎదురైతే అమ్మాయిలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ,100 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కావద్దన్నారు.శ్రద్ధతో చదివి జీవిత లక్ష్యాలను సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు, కళాశాల బృందం సభ్యులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

కలెక్టర్లకు సీఎం వైఎస్ జగన్ మార్గదర్శకాలు

 

Tags:Eve teasing is tough

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *