Natyam ad

పింఛన్ల ఒక్క ప్రాణం పోయినా సీఎస్ దే బాధ్యత- ఎన్డీయే కూటమి

అమరావతి ముచ్చట్లు:

 

పింఛన్ల పంపిణీలో సీఎస్‌ జవహర్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఎన్డీయే కూటమి నేతలు సచివాలయంలో ఆకస్మిక ధర్నాకు దిగారు. సీఎం, సీఎస్‌ కార్యాలయాలు ఉండే మొదటి బ్లాక్‌ వద్ద మెట్లపై బైఠాయించి ఆందోళన చేశారు.సీఎం జగన్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సీఎస్‌కు ఎన్నికల సంఘం లేఖ రాసిన నేపథ్యంలో తెదేపా, జనసేన, భాజపా నేతలు సీఎస్‌ను సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. మే నెల పింఛను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలని, ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

 

Post Midle

గ్రామ సచివాలయ ఉద్యోగులు సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కూడా పెన్షన్ల పంపిణీకి వినియోగించాలని సూచించారు. దీనిపై సీఎస్‌ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కూటమి నేతలు అక్కడే బైఠాయించి సీఎస్‌ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉన్నాధికారుల పొరపాటు, నిర్లక్ష్యం, దురుద్దేశం వల్ల 33 మంది వృద్ధులు పింఛను కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల వద్ద పెట్టిన ప్రభుత్వం.. పింఛను పంపిణీకి ఉద్యోగులను వినియోగించలేరా? అని ప్రశ్నించారు. మే నెల పింఛన్ల పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. తెదేపా నేత దేవినేని ఉమా, జనసేన నేత శివశంకర్‌, భాజపా నేత లంకా దినకర్‌ తదితరులు నిరసన తెలిపిన వారిలో ఉన్నారు.

 

Tags: Even if one life of pensions is lost, CS is responsible – NDA alliance

Post Midle