ఆనాడే పెద్ద నోట్ల రద్దు వద్దన్నా

Even if the announcement of the big banknotes was canceled

Even if the announcement of the big banknotes was canceled

-అసంఘటిత రంగంలో ఆర్థిక ప్రగతి కుంటుపడింది
 –   ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది
-నోట్ల రద్దుపై ఆర్‌బీఐ మాజీ గవర్నరు రఘురాం రాజన్‌
Date:13/04/2018
న్యూయార్క్‌ ముచ్చట్లు:
పెద్ద నోట్ల రద్దు చర్య మంచి నిర్ణయం కాదనే విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి సూచించానని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నరు రఘురాం రాజన్‌ వెల్లడించారు. కేంబ్రిడ్జ్‌ లోని హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌లో ప్రసంగిస్తూ నోట్ల రద్దు చర్యకు ముందు ప్రభుత్వంతో ఆర్‌బీఐ సంప్రదింపులు చేయలేదంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ‘నోట్ల రద్దుపై నేను ప్రభుత్వంతో సంప్రదించలేదనే విషయాన్ని ఎన్నడూ చెప్పలేదు. ఆ నిర్ణయం మంచిది కాదని భావిస్తున్నామని అప్పుడే ప్రభుత్వానికి తెలియచేశామ’ని పోనీ నోట్ల రద్దు నిర్ణయాన్ని అయినా సరైన ప్రణాళికతో అమలు చేశారా అంటే అది కూడా లేదని అన్నారు. దేశంలో చలామణిలో ఉన్న 87.5 శాతం నోట్లను రద్దు చేస్తున్నప్పుడు ముందస్తు సన్నద్ధత ఎంతో అవసరమని చెప్పారు. రద్దు చేస్తున్న మొత్తం నోట్ల విలువకు సమానమైన నోట్లను ముందుగానే ముద్రించుకొని ఆ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తే బాగుండేదని తెలిపారు. ఇవన్నీ చేయకుండానే భారత్‌ పెద్ద నోట్ల రద్దుకు నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసేస్తే, అప్పటివరకు పన్నులు కట్టకుండా నేలమాళిగలలో డబ్బును దాచుకున్నవారు రాత్రికి రాత్రే బయటకు వచ్చేసి క్షమించండి… మేం ఈ డబ్బులున్న విషయాన్ని మీ దగ్గర దాచాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని పన్ను కింద జమచేసుకోండని అంటారని అనుకోవడం మన భ్రమే అవుతుంది. భారత్‌ గురించి తెలిసిన వారెవరికైనా వ్యవస్థాగత లొసుగులను ఇక్కడ ఎంత త్వరగా వెతికేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ రద్దు చేసిన నోట్లన్నీ  తిరిగి వచ్చేసినా కూడా ఈ నిర్ణయం వెనక ఉద్దేశం ప్రత్యక్షంగా నెరవేరకపోయేదన్నరు.దీర్ఘకాలంలో పెద్ద నోట్ల ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటికైతే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమే పడింది. నోట్లు అందుబాటులోకి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెల్లింపులు చేయలేకపోయారు. ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఆర్థిక ప్రగతి కుంటుపడింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటిల్లో ఎక్కువ వరకు అసంఘటిత రంగంలోనివే కావడంతో ఎన్ని ఉద్యోగాలు పోయాయో లెక్కకు రాని పరిస్థితి. పెద్దనోట్ల రద్దు వల్ల భవిష్యత్‌లో సానుకూల ప్రభావాలు కనిపించినా అవి ఎంత మేరకు ఉపయోగకరమో ఇప్పుడు మనకు తెలియదు. నాకు తెలిసి ఆ సమయంలో ఈ విధానం ప్రయోజనకరం కాకపోవచ్చు. అందువల్ల నోట్ల రద్దు వల్ల దేశ వృద్ధిపై సానుకూల ప్రభావం ఉంటుందనే విషయాన్ని వివరించేందుకు మనం కొత్త ఆర్థిక సిద్ధాంతాన్ని కనుగొనాల్సిందే. ఈ పరిణామం వల్ల స్థూల దేశీయోత్పత్తిపై 1.5-2% వరకు భారం పడిందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ మద్దతుదార్లు మాత్రమే నోట్ల రద్దు నిర్ణయ ఫలాలు తక్షణమే కనిపిస్తాయని అంటున్నారు. పన్నుల చెల్లింపుల రూపంలో ఇవి సాక్షాత్కరిస్తాయని చెబుతున్నారు. అవును.. వాళ్లు చెప్పింది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
జీఎస్‌టీని మరింత పకడ్బందీగా అమలు చేయొచ్చు
పెద్ద నోట్ల రద్దు కావచ్చు.. వస్తు, సేవల పన్ను విధానం (జీఎస్‌టీ) కావచ్చు.. ప్రభుత్వం తెచ్చే ఏ సంస్కరణ అయినా సమర్థంగా అమలు చేస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు. జీఎస్‌టీ విధానాన్ని అనుకున్నదాని కంటే మరింత సమర్థంగా అమలు చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇదేమీ పెద్ద కష్టమైన పనేమీ కాదు. అయితే దీనిపై కసరత్తు చేయాలి. అందువల్ల ఈ విధానం విజయవంతంపై నేను ప్రస్తుతం ఆశలు వదులుకోవడం లేదు. భారత్‌లోని కొన్ని బ్యాంకుల్లో పటిష్ఠ వ్యవస్థలు లేకపోవడం వల్లే పీఎన్‌బీ కుంభకోణం లాంటివి వెలుగులోకి వస్తున్నాయి. వ్యవస్థాగత లోపాల వల్లే కొందరు ఉద్యోగులు, మధ్యవర్తులు కుమ్మక్కయి మోసాలకు పాల్పడుతున్నారు. అయితే పీఎన్‌బీ కుంభకోణం పూర్తిగా సైబర్‌ అంశానికి సంబంధించింది. ఈ కుంభకోణం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా వివరాలు బయటకు రావాల్సి ఉంది.
Tags: Even if the announcement of the big banknotes was canceled

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *