ఫిరాయింపుల చర్చలోనూ…టీడీపీనే టార్గెట్

Date:20/07/2019

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టే ప్రతి అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల అజెండాలో ఉన్న 23 అంశాలు గత ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేవిగానే ఉన్నాయి. అలాగే చంద్రబాబును మానసికంగా దెబ్బతీసేందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తీసుకున్న నిర్ణయాలపై లోతుగా చర్చించాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

 

 

 

 

 

అందుకు అనుగుణంగానే ప్రభుత్వం శాసనసభలో తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది.గత కొద్ది రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడుతుంది. పోలవరం ప్రాజెక్టు, కరకట్టపై ఆక్రమణలు, ఆరోగ్య శ్రీ, పసుపు కుంకుమ నిధులు, సదవర్తి భూములు, పక్కా గృహాలు ఇలా ఒక్కటేమిటి…? అన్ని అంశాలపై వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పై విరుచుకుపడుతోంది. ప్రతి అంశంపైనా కమిటీలు వేసి నిజానిజాలు నిగ్గుతేలుస్తామని వైసీపీ టీడీపీకి సవాల్ విసురుతోంది.

 

 

 

 

 

ఇక తాజాగా గత ప్రభుత్వ హయాంలో తమ పార్టీ నుంచి తీసుకున్న 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం, వారిలో నలుగురిని మంత్రులను చేయడం, తాము ఎంత పోరాడినా స్పీకర్ పట్టించుకోక పోవడం వంటి అంశాలు మళ్లీ శాసనసభ సాక్షిగా వైసీపీ ఎండగట్టాలని భావిస్తోంది. ఇందుకోసం శాసనసభలో ఫిరాయింపులపై చర్చ జరగాలని నిర్ణయించినట్లుంది. అందుకోసమే తాజాగా గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబు ఈ విషయాన్ని లేవనెత్తారు.ఫిరాయింపులపై చర్చకు అవకాశమివ్వకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని కూడా అన్నా రాంబాబు హెచ్చరించారు. దీనికి స్పీకర్ సభానాయకుడితో మాట్లాడిన తర్వాత చర్చిద్దామన్నారు.

 

 

 

 

 

వైసీపీ నుంచి గెలిచిన అన్నారాంబాబు లేవనెత్తిన ఫిరాయింపుల వ్యవహారాన్ని ఈ సమావేశాల్లోనే చర్చకు తీసుకురావాలని వైసీపీ భావిస్తుంది. తద్వారా చంద్రబాబునాయుడుని ఎండగట్టాలని, దీనికి చంద్రబాబు వద్ద సమాధానం ఉండదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద ఫిరాయిపుల వ్యవహారం చర్చకు వస్తే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమాధానం కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది.

ప్రైవేటకు రైల్వేల నిర్వహణ

 

Tags: Even in the debate of defects … TDP is the target

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *