పెద్దపల్లిలో  ఓడినా నైతికంగా ఎంతో మనో దైర్యాన్ని ఇచ్చింది

పెద్దపల్లిలో  ఓడినా నైతికంగా ఎంతో మనో దైర్యాన్ని ఇచ్చింది

– నాకు వచ్చిన ప్రతి ఓటు ఎంతో విలువైనది

– న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి

కమాన్ పూర్

తెలంగాణ ముచ్చట్లు:

 

తెలంగాణలో శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికలలో  పెద్దపల్లిలో తను ఓడినా నైతికంగా గెలిచినా అని ఈతీర్పు ఎంతో మనో దైర్యన్ని ఇచ్చింది అని న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి అన్నారు.  మార్పుకోసం ఒక్క అడుగు నినాదంతో ప్రజల్లోకి వెళ్ళిన తనకు వచ్చిన ప్రతి ఓటు ప్రజాస్వామ్యబద్ధంగా మరియు స్వచ్ఛందంగా  స్వతంత్రంగా వచ్చినవి అని అవి తనకు ఎంతో విలువైనవిగా భావిస్తాను అని అన్నారు. ఓటమిని అంగీకరిస్తూనే ప్రజలు ఇచ్చిన ఈతీర్పు తనకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది అని దీనిని  గౌరవిస్తు శిరసావహిస్తాను అని అన్నారు. సమాజంలో మార్పు కోసం, సామాజిక చైతన్యం కోసం న్యూ ఇండియా పార్టీ నుండి పెద్దపల్లి నియోజవర్గం అసెంబ్లీ కి పోటి చేసినా అని అన్నారు. తను ఓడినా ప్రజల పక్షాన ఉంటూ సామాన్య ప్రజల ఆర్థిక స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తా అని న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మరియు పెద్దపల్లి నియోజక వర్గ అభ్యర్థి జనగామ తిరుపతి ప్రకటించారు. అంబేద్కర్  కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును తనకు వేసిన ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ  ప్రజాసేవ చేస్తాను అని న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి తెలిపారు.

Tags:Even losing in Peddapalli gave a lot of morale

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *