Natyam ad

డ్రగ్స్ నిరోధించేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలి

సిద్దిపేట ముచ్చట్లు:

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు నిరోధించేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మారకద్రవ్యాలను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీ ఎస్ ఎన్ ఏ బి టీఎస్ నాబ్ తీవ్రంగా శ్రమిస్తుందన్నారు. గంజాయి మరియు కల్తీకల్లును నిర్మూలిద్దాం మన సమాజాన్ని, మన ప్రజలను మననే కాపాడుకుందాం, గంజాయి మరియు కల్తీకల్లు అల్పోజోలం, డైజోఫార్మా త్రాగడం వల్ల ప్రాణం పోతుంది ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. గంజాయి, డ్రగ్ మరియు కల్తీ కల్లు అల్ప్రాజోలం, డైజో ఫార్మా సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు, పౌరులు స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్ 8712671111, సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100, డయల్ 100 నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

 

 

 

Post Midle

పెద్ద ఎత్తున డ్రగ్స్, గంజాయి సమాచారం అందించిన వారికి నగదు రివార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి హోదాల్లో స్థిరపడాలని కలలు కంటున్నారు, కానీ కొంతమంది యువత గంజాయికి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు అయ్యి తమ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వారి తల్లిదండ్రుల యొక్క కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. కావున యువత గంజాయికి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి, సిద్దిపేట ఏసిపి మధు, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ గురుస్వామి, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, శ్రీధర్, కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఐటీ సెల్ ఎస్ఐ నరేందర్ రెడ్డి సిసిఆర్బి హెడ్ కానిస్టేబుల్ భాగ్య, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Every citizen should work to prevent drugs

Post Midle