ప్రతి ఇల్లు ఒక హరితవనంగా మారాలి

పట్టణంలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ
మున్సిపల్ ఛైర్ పర్సన్  భోగ శ్రావణి

జగిత్యాల ముచ్చట్లు:

ప్రతి ఇల్లు ఒక హరిత వనంగా మారాలని  అందుకు బాధ్యతగా ప్రతి ఒక్కరు ఇంటింటికీ మొక్కలు నాటాలని జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్  భోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు. మంగళవారం పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా జగిత్యాల మున్సిపల్ పరిధిలోని 7,18,25,30,32,33,వార్డుల్లో పూలు , పండ్ల మొక్కలను  మున్సిపల్ ఛైర్ పర్సన్  భోగ శ్రావణి ఇంటింటికి పంపిణీచేశారు.
ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ  హరితహారములో నాటిన మొక్కలను సంరక్షిస్తే అవి వృక్షాలై మనకు నిడతో పాటు ప్రాణావాయువును అందిస్తూ మానవాళికి అండగా నిలుస్తాయని తెలిపారు.
పట్టణాలు, పల్లెలు పచ్చదనంతో కళకళలాడాలని, ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్  తెలంగాణ లో  హరితహారం అనే మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆమే తెలిపారు.

వినియోగంలోకి ప్రాథమిక పాఠశాల

ప్రాథమిక పాఠశాల  గదులు ఉండి, పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా ఉండగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో  దానిని మున్సిపల్  ఛైర్పర్సన్   వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడడమే కాకుండా అంగన్వాడీ కేంద్రం నిర్వహణకు, అంతే కాకుండా నిరాక్షారాస్యులకు రాత్రి బడి కోసం ఉపయోగపడుతుందని స్థానికులు ఛైర్ పర్సన్  దృష్టికి తీసుకురాగా  కలెక్టర్ తో మాట్లాడి వినియోగంలోకి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఛైర్పర్సన్ శ్రావణిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతీ ప్రసాద్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు వల్లేపు రేణుక మొగిలి, బండారి రజిని నరేందర్, కోరే గంగమల్లు, చుక్క నవీన్, అరుముల్ల నర్సమ్మ, కల్లపెల్లి దుర్గయ్య, డి.ఈ లచ్చిరెడ్డి, ఎ.ఈ ఆయుబ్ ఖాన్, శరణతేజ, హరితాహారం ఇంచార్జి విద్యాసాగర్ రావ్, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి, అశోక్,  నాయకులూ, అధికారులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Every house should become a greenhouse

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *