Natyam ad

పుంగనూరులో ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా మంచినీరు

– పులివెందుల నుంచి పుంగనూరుకు
-వాటర్‌గ్రిడ్‌కోసం రూ.2700 కోట్లు
– మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పుంగనూరు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా మంచినీటిని అందిస్తామని , ఇందుకోసం వాటర్‌గ్రిడ్‌ నిర్మించేందుకు రూ.2700 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, పులివెందుల నుంచి పుంగనూరుకు మంచినీరు పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తామని రాష్ట్ర అటవీ, ఇంధనశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని రాగానిపల్లెలో జరిగిన సభలో మంత్రి ప్రసంగిస్తూ పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హామి ఇచ్చారని, ఈ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో రోడ్లు ఏర్పాట్లుకు రూ.260 కోట్లు విడుదలైందని , గ్రామీణప్రాంతాలలో మిగిలిపోయిన రోడ్లను కూడ గుర్తించి సిమెంటు రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం నుంచి నీరు ఇవ్వడం అభినందనీయమన్నారు. అలాగే తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గంలోని నేతిగుట్లపల్లె, ఆవులపల్లె వ ద్ద మూడు ప్రాజెక్టులు నిర్మించి, రైతులకు నీటిని సరఫరా చేస్తామన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటిలను పెట్టి వారికే సంక్షేమ పథకాలు అందించారని మంత్రి ఎద్దెవా చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వారికి కూడ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ప్రభుత్వందేనన్నారు. పార్టీలకు, కులాలకు , మతాలకు అతీతంగా సచివాలయంలో ధర ఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఆరు నెలలకు ఒక్కసారి సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరుగుతోందన్నారు. గడప గడపకు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వారు సైతం తమకు లక్షలాది రూపాయలు అందుతోందని చెప్పడం పారదర్శక ప్రభుత్వానికి నిదర్శనమన్నారు. పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలందరు ఐకమత్యంతో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిని, ఎంపీ మిధున్‌రెడ్డిని గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, జింకా వెంకటాచలపతి, రెడ్డెప్ప, ఆకుల గజేంద్రరాయల్‌ పాల్గొన్నారు.

Tags: Every household in Punganur has tap water

Post Midle