ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా రాజ్యాంగాన్ని చదవాలి
-మంథని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి
మంథని ముచ్చట్లు:
ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా రాజ్యాంగాన్ని చదవాలని మంథని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి సూచించారు. మంథని మున్సిపల్ పరిధిలోని కూచిరాజు పల్లిలో గల మైనార్టీ గురుకుల పాఠశాలలో మండల న్యాయ సేవ సమితి ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంథని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లు ఎక్కువగా వాడడం ద్వారా సైబర్ క్రైమ్ పెరుగుతున్నాయని, ప్రేమ పేరుతో అనేకమంది మోసపోతున్నారని, వాటన్నిటికీ దూరంగా ఉండాలని అన్నారు. 18 సంవత్సరాల లోపు విద్యార్థులపై లైంగిక దాడి జరిగితే ఫోక్సు చట్టం కింద శిక్షించడం జరుగుతుందన్నారు. ర్యాగింగ్ కు దూరం ఉండాలని ర్యాగింగ్ కు ఎవరైనా పాల్పడినచో, చట్ట పరంగా శిక్షార్హులవుతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సరిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, ఉపాధ్యక్షులు రఘుత్తమ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆర్ల నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాణి, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: Every single student must read the Constitution
