ప్రతి పల్లె అభివృద్ధి చెందాలి-ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

-ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతాం
-జడ్పి చైర్ పర్సన్ దావ వసంత

 

జగిత్యాల ముచ్చట్లు :

 

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని, ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు సిసి రోడ్లు కమ్యూనిటీ హాళ్ళుపచ్చదనం ఇలా అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ అభివృద్ధి చేస్తోందని గ్రామాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామంలో మూడు వార్డులలో 15 లక్షల నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రామాల్లో అభివృద్ధిని స్వయంగా చూస్తున్నామని సకల సదుపాయాలు కల్పించుకుంటున్నామని నాటికీ నేటికీ తేడాను చూస్తున్నామని అన్నారు. అభివృద్ధితో పాటు చెరువుల పరిరక్షణ కై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.

 

 

 

జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కై ఎన్ని నిధులు ఇచ్చేందుకు అయినా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రతి పల్లె ఆదర్శంగా ఉండాలని పచ్చదనంతో నిండాలని ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలేపు రాజేంద్రప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, మండల ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షుడు మహేష్ , సర్పంచ్ ఎల్లా గంగనర్సు రాజన్న, ఉప సర్పంచ్ పద్మ తిరుపతి, ఏ యం సి డైరెక్టర్ మోహన్ రెడ్డి, సత్యం,సోహెల్, షకీల్, మహేష్ , పుదరి శ్రీనివాస్, మొర్రి సురేష్ , ముత్యం, వెంకటేష్ , నాగయ్య పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Every village should be developed – MLA Dr. Sanjay Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *