అందరూ ఎదగడమే లక్ష్యం

Date:12/11/2018
నెల్లూరు ముచ్చట్లు:
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉపాధి కల్పించేందుకు  సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తోంది. ఆదరణ-2 పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల యూనిట్లు గ్రౌండ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 3,731 మందికి రూ.62.74 కోట్లతో పరికరాలు అందజేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
సోమవారం నాడు అయన పేదరికంపై గెలుపు పేరుతో నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమానికి హజరయ్యారు. ఈ సందర్బంగా అయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సబ్సిడీ బ్యాంకు రుణాలు(మెగా గ్రౌండింగ్ మేళా),  ఆదరణ పథకం పనిముట్ల పంపిణీ చేసారు.  ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ ముత్యాలరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు.
మంత్రి మాట్లాడుతూ  ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు కూడా 90 శాతం సబ్సిడీతో పరికరాలు అందజేస్తున్నాం. బీసీ భవన్ కు నెల్లూరులోని హరిత హోటల్ పక్కన 44 సెంట్లను కేటాయించడంతో పాటు నిర్మాణానికి రూ.4.85 కోట్లు మంజూరు చేశాం.. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు.  రూ.9.73 కోట్లతో జిల్లాలో మూడు అంబేద్కర్ భనవాల నిర్మాణం చేపట్టాం. రూ.4.50 కోట్లతో నెల్లూరులో షాదీ మంజిల్ నిర్మిస్తున్నాం.
ప్రతిపక్ష పార్టీ నాయకులు లిటికేషన్లు పెట్టకుండా మేము చేస్తున్న అభివృద్ధిని చూస్తుంటే చాలు. పేదలకు, చివరకు గిరిజనులకు ఇళ్ల స్థలాలిస్తున్నా , ఇళ్లు కట్టిస్తున్నా జిల్లాలో కొందరు కోర్టుకు పోయి అడ్డుకుంటున్నారని అన్నారు. సీజేఎఫ్ఎస్ సొసైటీలను రద్దు చేసి లబ్ధిదారులకు భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు అసైన్మెంట్ కమిటీలో ఆమోదించే ప్రక్రియను వాయిదా వేయించాలని ఒకరిద్దరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రయత్నించారు.
వాయిదా వేసే ప్రసక్తే లేదని, త్వరితగతిన పట్టాలు పంపిణీ చేయాలని అదే సమావేశంలో ఆమోదించామని అన్నారు. రూ.6,600 కోట్ల విలువైన ఆస్తికి దళితులు,గిరిజనులు, బీసీలను యజమానుల్ని చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపుల్లోనూ గత ప్రభుత్వాల పదేళ్ల పాలనతో పోలిస్తే ఈ నాలుగున్నరేళ్లలో నాలుగైదింతలు ఎక్కువ నిధులు మంజూరు చేశాం. అందరూ ఆర్థికంగా, సామాజికంగా సమానంగా ఎదగడమే మా లక్ష్యమని సోమిరెడ్డి అన్నారు.
Tags; Everybody wants to grow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *