Natyam ad

కిషోర్‌ ఆగడాలు గురించి అందరికి తెలుసు – పెద్దిరెడ్డి ఆగ్రహం

-మంత్రి పెద్దిరెడ్డి కుటుంభాన్ని విమర్శించే అర్హత లేదు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తన అన్న ముఖ్యమంత్రిగా ఉండటంతో పుంగనూరు, పీలేరుతో పాటు అనేక ప్రాంతాలలో చేసిన ఆగడాలు, అరాచకాలు గురించి అందరికి తెలుసునని, మంత్రి పెద్దిరెడ్డి కుటుంభాన్ని విమర్శించే స్థాయి కిషోర్‌కు లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ కిషోర్‌ తన అన్న పలుకుబడితో పుంగనూరులో పోలీసులను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులచే అరాచకాలు సృష్టించలేదా అంటు నిలధీశారు. పీలేరులో కోట్లాది రూపాయలు విలువ చేసే గుట్టలను సైతం కబ్జాలు చేశారని ఆరోపించారు. మంత్రికి చెందిన డైరీలో తగిన ధరలతో పాలు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. హెరిటేజ్‌లో దోపిడి చేస్తున్నా కిషోర్‌కు కనపడలేదా అంటు నిలధీశారు. పుంగనూరు , తంబళ్లపల్లె , పీలేరు నియోజకవర్గాలలో పెద్దిరెడ్డి కుటుంబం అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపిస్తే తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. కిషోర్‌కుమార్‌రెడ్డి ఇకనైనా పద్దతులు మార్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

Tags: Everyone knows about Kishore’s agadalu – Peddireddy’s anger

Post Midle