Everyone over the age of 18 should have the right to vote

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి

Date:25/01/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును పొందాలని తహసీల్దార్‌ శ్రీనివాసులు అన్నారు. శనివారం అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం ను పురస్కరించుకొని మండలకేంద్రంలో హైస్కూల్‌ విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు, బిఎల్వోలు వివిధశాఖల అధికారులు, సిబ్బంది తో కలిసి ర్యాలి నిర్వహించారు.ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఉన్న విలువను తెలుపుతు ప్లేకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. స్థానిక బస్టాండులో మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల ఓటు హక్కుకోసం ధరఖాస్తుచేసుకొన్నవారికి ఓటరు కార్డులను పంపిణీ చేసి సీనియర్‌ సిటిజన్‌లను తదితరులను సన్మానించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువలను విద్యార్థులు తల్లితండ్రులకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకరయ్య, తదితరులున్నారు.

సచివాలయ నిర్మాణపనులను తనిఖీ చేసిన జెసి చంద్రమౌళి

Tags: Everyone over the age of 18 should have the right to vote

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *