Natyam ad

పుంగనూరులో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులుకావాలి

పుంగనూరు ముచ్చట్లు:

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు పిలుపునిచ్చారు. సోమవారం కోర్టు ఆవరణంలో కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, ఫారెస్ట్ అధికారులు రాకేష్‌, సురేంద్రతో కలసి మొక్కలు నాటారు. అలాగే మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు , అటవీశాఖ సిబ్బంది కలసి మొక్కలు పంపిణీ చేశారు. అలాగే పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే మున్సిపల్‌ డంపింగ్‌యార్డ్ ఆవరణంలో పర్యావరణశాఖాధికారి కృష్ణవేణి ఆధ్వర్యంలో క్యూబయో ఎనర్జీ వారు వెహోక్కలునాటారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ పట్టణంలో ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటాలన్నారు. పర్యవరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ వినియోగం నిషేధించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు గల్లాశివశంకర్‌నాయుడు, వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, అటవీశాఖసిబ్బంది పాల్గొన్నారు.

Post Midle

Tags: Everyone should be a part of protecting the environment in Punganur

Post Midle