Natyam ad

ప్రతి  ఒక్కరూ  దేశభక్తి  కలిగి  ఉండాలి

నంద్యాల ముచ్చట్లు:

 

తల్లి దండ్రులను. పుట్టిన భూమిని మరువ కూడదని ప్రతి ఒక్కరూ దేశ భక్తి కలిగి ఉండాలని మూడో పట్టణ సీఐ పులి శేఖర్ అన్నారు. శుక్రవారం నాడు కరుణామయ విద్యాసంస్థలలో ఛైర్మెన్ దండే దస్తగిరి  అధ్వర్యంలో, కరస్పాండెంట్ దండే నరేష్ పర్యవేక్షణలో ఘనంగా జరిగిన ఆజాధిక కా అమృత్ మహోత్సవము మరియు హర్ ఘార్ తిరంగా కార్యక్రమంలో ముఖ్య అతథులుగా  సీఐ పాల్గొన్నారు, రోటరీ క్లబ్ సభ్యులు. రామలింగా రెడ్డి  జెండా ఊపి ర్యాలీనీ ప్రారంభించారు. . రోటరీ క్లబ్ సెక్రెటరీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యా పోరాటంలో ఎంతో మంది మహనుభావులు అమరులు అయ్యారని, వారి సేవలను ఎప్పటికీ గుర్తుకు పెట్టు కోవాలన్నారు . కరుణామయ విద్యా సంస్థల చైర్మన్ దండే దస్తగిరి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేశ ప్రతిష్టను గొప్పగా కీర్తిస్తూ అజాధి కా అమృత్ కార్యక్రమాన్ని నంద్యాల పట్టణం లో ఘనంగా నిర్వహిస్తున్నమన్నారు. విద్యాసంస్థల డైరెక్టర్ దండే వెంకట నరేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయుడు వారి ఇంటి పైన మువ్వన్నెల జెండా ఎగరేసి దేశ భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్ర, బాషా, శోభ రాణి, విద్యార్థులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

 

Tags: Everyone should be patriotic

Post Midle
Post Midle