Natyam ad

ఎన్నికల కమిషన్‌ మేరకు ప్రతి ఒక్కరు నడుచుకోవాలి

-ఆర్‌వో మధుసూదన్‌రెడ్డి

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు నిబంధనలకు లోబడి ఉండాలని ఆర్‌వో మధుసూదన్‌రెడ్డి కోరారు. సోమవారం ఏఆర్‌వో నరసింహప్రసాద్‌ తో కలసి ఎంపీడీవోలు, తహశీల్ధార్లతో పాటు రాజకీయ పార్టీల నేతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌వో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈనెల 16 నుంచి ఎన్నికల కోడ్‌ అమలులో ఉందన్నారు. కోడ్‌ అమలులో ఉన్న కారణంగా ఏ స్థాయి ఉద్యోగస్తులైన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరాదన్నారు. నియోజకవర్గంలో 262 పోలీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి , ఎన్నికల అధికారులను నియమించడం జరిగిందన్నారు. ప్రచారాలు, ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఏ సమస్యలు ఎదురైన తక్షణమే సి విజిల్‌కు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తే తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

 

Tags: Everyone should follow the Election Commission

Post Midle