ప్రతి ఒక్కరు ఓటు విలువను తెలుసుకోవాలి -చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:
 
 
ప్రజాస్వామ్యదేశంలో యువతి, యువకులు ముఖ్యంగా ఓటు విలువలు, హక్కులను సద్వినియోగ పరచాలని చైర్మన్‌ అలీమ్‌బాషా సూచించారు. మంగళవారం చైర్మన్‌ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కమిషనర్‌ రసూల్‌ఖాన్‌, తహశీల్ధార్‌ వెంకట్రాయులు తో కలసి లీనార్డ్ హైస్కూల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదై, ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ఓటరుగా నమోదు కావాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమకు నచ్చిన వారికి నీతినిజాయితీగా ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ఓటును అమ్ముకోవడం, ప్రలోభాలకు లోనుకాకుండ ఓటు విలువను మరింతగా పెంచేలా చైతన్యవంతులుకావాలని కోరారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలో ఓటరుకు ఎంతో విలువ ఉండేలా రాజ్యాంగం మనకు ఓటు హక్కు ప్రసాదించిందని తెలిపారు. ఈ సమావేశం వైస్‌ చైర్మన్‌ సిఆర్‌.లలిత, కౌన్సిలర్లు అర్షద్‌అలి, తుంగా మంజునాథ్‌, హెచ్‌ఎం బృందాదేవి, స్కూల్‌కమిటి చైర్మన్‌ మౌల, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, విశ్రాంత హెచ్‌ఎం చెంగారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దాడులను అరికట్టాలి
Tags: Everyone should know the value of the vote -Chairman Aleem Basha

Natyam ad