ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలి

మందమర్రి ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మందమరి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు లో మంగళవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు సమన్వయకర్త పంజాల ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు,పట్టణ ఎస్ఐ భూమేష్, విద్యుత్ ఏఈ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ పర్యావరణానికి తోడ్పడాలని వారు తెలిపారు. అలాగే వార్డు లో ఎలాంటి సమస్యలు ఉన్నా వారి దృష్టికి తీసుకురావాలని వారు ఉన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు పర్యావరణం పై అవగాహన కల్పించి మొక్కలు పంపిణీ చేశారు. అలాగే తడి చెత్త, పొడి చెత్త డబ్బాలను అందించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కొంగల తిరుపతిరెడ్డి, యూత్ సమన్వయకర్త కొంగల శ్రీనివాస్ రెడ్డి, సామల సత్యనారాయణ, ఆవుల ఓదెలు, 20 వార్డు మున్సిపల్ ఇంచార్జి ప్రవీణ్, యు ఆర్ పి లు శోభారాణి, లక్ష్మి, రఘురాం, వార్డు అధ్యక్షురాలు రాజమణి, సూర్య సుజాత, దుర్గయ్య మన్నెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Everyone should observe the cleanliness of the surroundings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *