పల్లె ప్రగతి లో అందరూ పాల్గోనాలి

పఠాన్ చెరువు ముచ్చట్లు:

 

 

పల్లెలు,పట్టణాలను పరిశుభ్రంగా చేసుకుని, అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో  ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని  తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ వి. భూపాల్ రెడ్డి అన్నారు.  పఠాన్ చెరువు నియోజకవర్గం రామచంద్రారెడ్డి నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భూపాల్ రెడ్డి,  ,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు.  పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆర్ సి పురం కమ్యూనిటి హాల్ పరిసరాల్లో, రామచంద్రాపురం ఎమ్మార్వో ఆఫీసు పరిసరాలను  స్వయంగా   ప్రొటెం భూపాల్ రెడ్డి  రోడ్లు శుభ్రం చేసి మొక్కలు  నాటారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పల్లె ,పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ,    పరిశుభ్రతను పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో  ఆర్ సి పురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి,  స్థానిక టి ఆర్ యస్ పార్టీ నేతలు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Everyone should participate in rural development

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *