ప్రతి ఒక్కరు తెలుగుబాషలో మాట్లాడాలి
పుంగనూరుముచ్చట్లు:
తెలుగు గడ్డపై పుట్టిన మనం తెలుగుబాషలో మాట్లాడుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశేఖర్ సూచించారు. మంగళవారం స్థానిక శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు సాహితిసమాఖ్య వారిచే తెలుగుబాష వినియోగంపై విద్యార్థులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలుగుబాష కోసం కృషి చేసిన గురుజాడ అప్పారావు , గిడుగురామమూర్తి సేవలను కొనియాడారు. తెలుగుబాషలోని మాధుర్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి, తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాషాభిమానులు భక్తవత్సలం, జయరామిరెడ్డి, విశ్రాంత పండితులు గంగులమ్మ, రెడ్డెప్పరెడ్డి, ద్వారకమ్మ, సీతాపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

పరీక్షలకు సన్నద్ధంగా ఉండాలి…
స్థానిక శుభారాం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బిట్‌బూట్‌క్యాంప్ ను మంగళవారం నిర్వహించారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరీక్షలకు వెళ్లే వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా నలుగురు విద్యార్థులు ఎ.జశ్వంత్, శ్రావణ్‌కళ్యాణ్, హేమంత్, సైదాబాను క్యాంపులో ఎంపికైయ్యారు.
Tags: Everyone should speak Telugu
