పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషిచేయాలి

– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

Date:19/10/2019

హైదరాబాద్  ముచ్చట్లు:

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా నేడు నాంపల్లి  సనత్ నగర్ నియోజకవర్గాల్లో సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో భాగంగా గాంధీజీ స్వాతంత్రం కన్నా స్వచ్ఛభారత్ ముఖ్యమని నమ్మరని ప్రధాని మోడీ కూడా గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో 150 కిలోమీటర్ల పాదయాత్ర చెయ్యాలని సూచించారని అందులో భాగంగా అక్టోబర్ 2 నుంచి గాంధీ సంకల్పయాత్ర చేస్తున్నానని  పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషిచేయాలని వాతావరణ సమతుల్యత లేకపోవడంతోనే అసంబద్ధ వర్షాలు విపరీతమైన ఎండలు మనం సవి చూస్తున్నామని కిషన్రెడ్డి అన్నారు ఒక్కసారే ఉపయోగించే ప్లాస్టిక్ పైన మనం దృష్టి పెట్టాలని వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలని కిషన్ రెడ్డి అన్నారు అక్కడా ఇక్కడా అని కాకుండా రోడ్లపై కాలువల్లో ఖాళీ ప్రదేశాల్లో చివరకు ఫారెస్ట్ లో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి పర్యావరణ దెబ్బతిని కాలుష్యం లో జీవిస్తున్నామని ఈ సమస్యను మనకు మనమే పరిష్కరించుకోవాలి అని కిషన్ రెడ్డి సూచించారు.

 

పరిగిలో బంద్ ప్రశాంతం

Tags: Everyone should strive to protect the environment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *