Everyone should use toilets

ప్రతి ఒక్కరు మరుగుదొడ్లను వినియోగించుకోవాలి

– ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Date:27/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరు మరుగుదొడ్డిని వాడకంలోకి తీసుకోవాలని ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు సూచించారు. గురువారం పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు, వలంటీర్లకు మరుగుదొడ్ల వినియోగంపై పీఎస్‌ఐ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సును ట్రైనర్‌ రాజు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ మరుగుదొడ్ల వాడకంపై క్షేత్రస్థాయి నుంచి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య ప్రవర్తనలో మార్పును ప్రోత్సహించేందుకు మరుగుదొడ్ల వాడకం చేపట్టాలన్నారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య సేవకులను నియమించడం జరిగిందన్నారు. వారు ప్రతి రోజు ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ విషయంలో వలంటీర్లు మరింత శ్రద్ద తీసుకుని మరుగుదొడ్ల వినియోగాన్ని వందశాతం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రెడ్డిరాణి, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌రెడ్డి, శిక్షకులు సురేష్‌, సుబ్రమణ్యం, మధు తదితరులు పాల్గొన్నారు.

జగన్‌, సాక్షి అంటే చంద్రబాబుకు వెన్నులో వణుకు

Tags: Everyone should use toilets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *