పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

everyone-should-work-hard-for-party-strength

everyone-should-work-hard-for-party-strength

Date:14/09/2018

పలమనేరుముచ్చట్లు:

పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి .2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇప్పటి నుండే ప్రణాళికలు, కార్యాచరణలతో, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలమనేర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగదీశ్ నాయుడు అన్నారు .

 

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పలమనేరు మండల తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పల్లెలోనూ పార్టీ ప్రతిష్టకు ఆయా పంచాయతీల పరిధిలోని నాయకులు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.

 

తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరింత విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యత నాయకులపై ఉందన్నారు.

 

ఐదుకోట్ల ఆంధ్ర ప్రజల పై కక్షసాధింపు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ఐదు కోట్ల ప్రజలపై సాధింపు లో భాగంగా గత ఎనిమిది సంవత్సరాలకు మునుపు జరిగిన విషయాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు అందజేయడం విడ్డూరంగా ఉందన్నారు.

 

రాజకీయ లబ్ధికోసం ఇలాంటి కుట్ర రాజకీయాలకు పాల్పడితే ప్రజలు ఆగ్రహానికి గురికాక తప్పదు అన్నారు. ఇలాంటి విషయాలలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతోంది తప్ప తరగదనే విషయాన్ని వారు తెలుసుకోవాలని హితవు పలికారు .

ఈ సమావేశంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లేశ్వర్ రెడ్డి నాయకులు వెంకటరత్నం మరియు అన్ని గ్రామపంచాయతీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

పాలేరులో మంత్రి తుమ్మలకు ఘనస్వాగతం

Tags:Everyone should work hard for party strength

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *