విశాఖపట్నం ముచ్చట్లు:
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏయూ విసి ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏయూ మెట్రోలజీ ఓసినోగ్రఫీ విభాగం ఆధ్వర్యంలో మొబైల్ ఎయిర్ పొల్యూషన్ వాహనాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తద్వారా వాతావరణంలోని కాలుష్యాన్ని అరికట్టడానికి వీలు కలుగుతుందన్నారు. గాలిలో కాలుష్యం పరీక్షించే సౌకర్యం ఈ మొబైల్ ఎయిర్ పొల్యూషన్ వాహనం ద్వారా వీలు కలుగుతుంది అన్నారు. సుమారు 50 లక్షల రూపాయల ఖర్చుతో ఈ వాహనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే వాతావరణంలోని ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ ఇతర వాయువుల సాంద్రత వాటి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. మొబైల్ ఎయిర్ పొల్యూషన్ లాబ్ ఉన్న ఏకైక యూనివర్సిటిగా ఆంధ్ర యూనివర్సిటీ పేరుగాంచడం ఆనందంగా ఉందన్నారు.

Tags;Everyone should work to protect the environment
