హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

పెద్దపల్లి ముచ్చట్లు :

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రామగిరి ఎంపీపీ ఆ రెల్లి దేవక్క కొమురయ్య, కమాన్పూర్ మార్కెట్ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ అన్నారు. బుధవారం రామగిరి మండలం రత్నపూర్ గ్రామంలో భాగంగా మొక్కలు నాటడానికి గుంతలు తవ్వకాలను సర్పంచ్ పల్లె ప్రతిమ పివి రావుతో కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారని అన్నారు నేడు ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా మొక్కల పెంపకం తో పాటు నర్సరీలు ఉన్నాయన్నారు హరితహారం మూలంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కాలుష్యం తగ్గిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ  తూముట్ల విజయకుమార్, ఎంపీఓ కాటం భాస్కర్, ఎంపీటీసీ ధర్ముల రాజ సంపత్, కో ఆప్షన్ మెంబర్ ఎండి ఇబ్రహీం, ఉపాధి ఏపిఓ నర్సింగ్ రమేష్, టిఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు కాపరబోయిన భాస్కర్, వార్డ్ సభ్యులు కోవ్వురి సురేష్, బొంగురాల రవి, ఉడుత శంకర్, కెక్కర్ల ఉష, ఉనుగొండ మధుకర్, టిఆర్ఎస్ నాయకులు సందేవేన కుమార్, మన్నాల రాహులు, బెజ్జల రాజయ్య, భోగే సతీష్, జక్కుల మహేశ్, దాసరి మల్లి పాల్గొన్నారు.

 

భర్తను కొట్టి చంపిన భార్య

Tags:Everyone wants to share in the greenery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *