18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును కలిగి ఉండాలి- లింగాల తాసిల్దార్ మునిరోద్దీన్
నాగర్ కర్నూల్ ముచ్చట్లు:
నాగర్ కర్నూల్ జిల్లాలోనీ లింగాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితా సవరణలో భాగంగా ఈ శని, ఆదివారం నాడు ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లులింగాల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తాసిల్దార్ మునీరుద్దీన్ అన్నారు.
శనివారం ఆయన లింగాల మండల పరిధిలోని లింగాల సూరాపూర్ అంబటిపల్లి తో పాటు అన్ని గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి ఓటర్ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని భారత రాజ్యాంగం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు.లింగాల ఉన్నత పాఠశాలలో రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా
భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాపాడే బాధ్యత అందరిపై ఉందని తాసిల్దార్ మునిరోజిన్ తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలతో అలంకరణ చేసి, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. భారత రాజ్యాంగం గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న దేశం మనదని,
అంత మంది ఓటర్స్ తో సాధారణ ఎన్నికలు ఎంతో సులభంగా ప్రశాంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. అందుకు మన రాజ్యాంగమే కారణమని,
రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గొప్పతనాన్ని, సేవలను తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
వారు అందించిన ఈ ఫలాలే ఈరోజు దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.రాజ్యాంగం ప్రజలకు కల్పించిన విలువలు, హక్కులను కాపాడే బాధ్యత మన అందరిపై ఉన్నదని, తప్పకుండా చేసే ప్రతి పనిలో ఆ అంశాన్ని గుర్తు పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా కంకణబద్ధులై పనిచేయాలని తాసిల్దార్ మునీరుద్దీన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి శేఖర్. తాసిల్దార్ జూనియర్ అసిస్టెంట్ వసీం. వీఆర్ఏ సతీష్. ఉపాధ్యాయులు వెంకట్ రాజు నిరంజన్ తదితరులు ఉన్నారు.

Tags: Everyone who has completed 18 years of age should have the right to vote- Lingala Tahsildar Muniruddin
