Natyam ad

అందరి ఆరోగ్య క్షేమమే జగనన్న సురక్ష

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజలందరి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు బాగుచేసేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్లు గంగులమ్మ, మమత సూచించారు. బుధవారం పట్టణంలోని కొత్తపేట వైఎస్సార్‌ అర్భన్‌ హెల్త్ సెంటర్‌లో సురక్ష కార్యక్రమాన్ని డాక్టర్లు జగదీష్‌కుమార్‌, మదన్‌కుమార్‌, పుష్పకుమారి, రంజిత లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను పరిశీలించి వారికి ఉన్న సమస్యలను గుర్తించి, నమోదు కార్యక్రమం నిర్వహించారు. మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గంగులమ్మ మాట్లాడుతూ సురక్ష కార్యక్రమంలో 409 మంది రోగులకు చికిత్సలు చేసి, అవసరమైన వారికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు లక్ష్మణరాజు, తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Everyone’s health is the safety of the world

Post Midle