ఎన్నీ సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు

Everything has been reacted at times

Everything has been reacted at times

– కంటతడి పెట్టిన బాబు మోహన్
Date:11/10/2018
సంగారెడ్డి  ముచ్చట్లు:
నన్ను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది కేసీఆర్.. ఇప్పుడు నన్ను నడి రోడ్డుపై వదిలేసింది కూడా కేసీఆర్ రే.  కేసీఆర్ ని గాడ్ ఫాదర్ గా భావిస్తాను. కానీ ఆయన నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని అందోళ్ మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ అన్నారు. గురువారం నాడు అయన సంగారెడ్డి బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రెస్ మీట్ అయన కంట తడిపెట్టారు.  స్థానికుడి పేరుతో మరో వ్యక్తికి టికెట్ కేటాయించారు.  25సంవత్సరాలుగా ఆందోల్ నుంచే పోటీ చేసిన తాను ఎలా స్థానికుడిని కాకుండా పోయాన అని ప్రశ్నించారు. తనకి టికెట్ రాకుండా డమ్మీ సీఎం(కేటీఆర్) ఎంపీ అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.  సముద్రంలో ఉన్న నన్ను ఒక్క సరిగా నడి రోడ్డు పై పడేసారని… కన్నీటి పర్యంతం అయ్యారు.
ఉరిశిక్ష వేసే ఖైదీలకు ఆఖరి కోరిక అడుగుతారు. కానీ 25సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాకు సమాచారం కూడా ఇవ్వలేదని అవేదన వ్యక్తం చేసారు.  25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా బ్రతికాను.  ఎమ్మెల్యే గా ఉన్న నాకు కనీస సమాచార కూడా ఇవ్వలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ స్పందించలేదు.  ఈ రోజు వరకు నాకు టిఆర్ ఎస్ నాయకులు కనీసం ఫోన్ కూడ చెయ్యలేదని అయన వాపోయార.  నా సేవలను జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ గుర్తించింది. అందుకే ఆ పార్టీలో చేరానని అన్నారు.
Tag:Everything has been reacted at times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *