వైసీపీలో అంతా అయోమయం

Everything is confusing in the YSRCP

Everything is confusing in the YSRCP

Date:27/02/2018
విజయవాడ   ముచ్చట్లు:
ఓదార్పుయాత్రలు లాభంలేదు.. ప్రజాసంకల్ప జాతర.. ఆశించిన ప్రయోజనం ఇవ్వలేదు. అధికార టీడీపీపై చేసిన విమర్శలకు దిశానిర్దేశం లేకుండా పోయింది. ఫలితంగా వైసీపీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయనేది వైసీపీ నేతల ఆందోళనకు కారణం. ఏపీకు ప్రత్యేక హోదా విషయాన్ని క్యాచ్ చేసుకోవాల్సిన ప్రతిపక్షం కాస్తా దూకుడు చర్యతో చేతులారా పాడుచేసుకుందనే అభిప్రాయం జనాల్లో బలంగా నాటుకుపోయింది. బీజేపీ, టీడీపీ పొత్తులను చెడగొట్టి.. మధ్యలో వైసీపీ చేరాలనే ఆరాటం తెరమీదకు వచ్చింది. ఊహించని విధంగా జగన్ రాజీనామాలంటూ ఎంపీలను ముందుకు తోయటాన్ని కూడా ఆపార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సీనియర్లను సంప్రదించకుండా జగన్  ఒక్కడే నిర్ణయాలు తీసుకోవటాన్ని కూడా తప్పుబడుతున్నారు. వాస్తవానికి ఏపీలో అధికార టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. అదే సమయంలో ప్రతిపక్షం బలంగా లేదనే వేదనా ఉంది. అనుభవం వున్న నేతగా చంద్రబాబుకు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవట్లదనే విమర్శలూ లేకపోలేదు. గతంలో తీసుకున్నంత వేగంగా సీఎం నిర్ణయాలు తీసుకోలేకపోవటాన్ని తేలికగా తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా సర్కారు తీరును ఎండగడుతున్నారు. గుడ్డికంటే మొల్ల నయం అనే విధంగా వైసీపీతో పోల్చితే కొత్త ఉత్తమం అనే అభిప్రాయం కూడా తటస్థ ఓటర్లలో ఉండటం టీడీపీకు కాసింత ఊరటనిచ్చే అంశం. పరిణామాలు ఎలా దారితీసినా.. తమకేం ఢోకాలేదనే అతి ఆత్మవిశ్వాసం టీడీపీ నేతలు.. ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదనే విమర్శలూ లేకపోలేదు. ఇన్ని సమస్యల్లోనూ జనం.. టీడీపీ వైపు ప్రతికూలంగా ఉండటం.. వైసీపీలో కొత్త కంగారుకు కారణమైంది. నెలల తరబడి ప్రజాసంకల్ప యాత్రలో జనం మధ్య వున్నా.. సమస్యలను వదిలేసి.. కేవలం తనను సీఎం చేయమని.. 2019లో మనదే సర్కారంటూ చెప్పటం.. జగన్ అధికార తపనకు అద్దంపడుతుందనే వాదన ప్రజల్లో బలపడుతున్నట్లు పార్టీ వర్గాలు గుర్తించాయి.
Tags: Everything is confusing in the YSRCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *