ఆక్రమణే అంతా 

Date:26/03/2020

ఏలూరు ముచ్చట్లు:

మెట్ట ప్రాంతంలో సాగు, తాటి నీటి అవసరాలు తీరుస్తున్న ఎర్రకాలువ జలాశయ గర్భం ఆక్రమణల చెరలో చిక్కుకుంది. ప్రాజెక్టుకు చెందిన మిగులు భూములను

కొందరు ఆక్రమించి వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఆక్రమిత భూముల్లో సాగుకు అవసరమైన నీటిని జలాశయం నుంచి అక్రమంగా తోడుకుంటున్నారు. ఆక్రమణల కారణంగా జలాశయంలో నీటి నిల్వ

సామర్థ్యం తగ్గిపోతోందని, అరకొరగా ఉన్న జలాలు చౌర్యానికి గురవుతుండటంతో తమ పాలాలకు సాగునీటి కొరత ఏర్పడుతుందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంతాన్ని

సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం వద్ద ఎర్రకాలువ ప్రాజెక్టును నిర్మించారు. జలాశయం కోసం అప్పట్లో రెండు విడతల్లో 5,212 ఎకరాలను రైతుల నుంచి

సేకరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఆరు మండలాల పరిధిలో 17 వేల ఎకరాలకు సాగునీరు, 18 గ్రామాలకు తాగునీరు అందుతోంది. జలాశయంలోకి ఏటా పూర్తిస్థాయిలో నీరు చేరే పరిస్థితి

లేకపోవడంతో గత కొన్నేళ్లుగా కొందరు అక్రమార్కులు ప్రాజెక్టు భూములను ఆక్రమించి సరిహద్దు గట్లు, ఇనుప కంచెలు వేసి వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా

జలవనరుల శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇదే అదునుగా మరికొందరు ఇటీవల మరింత భూమిని ఆక్రమించి సరిహద్దు గట్లు వేయిస్తున్నారు. జలాశయ గర్భంలో తాత్కాలిక కాలువలు

తవ్వించి డీజిల్‌ ఇంజిన్లతో నీటిని తోడి ఆ భూముల్లో వేసిన పంటలకు సరఫరా చేస్తున్నారు. జలాశయ గర్భం, పరివాహక ప్రాంతాల్లో దాదాపు 1200 ఎకరాల మేర మిగులు భూములు ఉన్నాయి. వీటిలో

దాదాపు 750 ఎకరాల వకు అక్రమణదారుల చెరలో ఉన్నాయి. వేగవరం, తాడువాయి, ఎ.పోలవరం, మాతన్నగూడెం, కొంగువారిగూడెం గ్రామాల పరిధిలో ఎక్కువ భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఈ

భూములకు సరిహద్దు గట్లు, ఇనుప తీగలతో కంచెలు వేసి దీర్ఘకాలిక పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండటంతో అంతర్భాగంలో భూములు

ఖాళీ అయ్యాయి. వీటిపై కూడా అక్రమార్కుల కన్నుపడింది. ఇలాంటి భూములను చదును చేయించి సుమారు 375 ఎకరాల్లో మొక్కజొన్న, వరి, కందులు, టమోటా, బెండ, మిరప తదితర పంటలు సాగు

చేస్తున్నారు. గతంలో పరిసర గ్రామాలకు చెందిన పశు పోషకులు, చిన్న, సన్నకారు రైతులు, మత్స్యకారులు ప్రాజెక్టు మిగులు భూముల్లో పశువులను మేపుతూ పాడి ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం

సాగించేవారు. ప్రస్తుతం మిగులు భూములన్నీ ఆక్రమణకు గురికావడంతో పశువులను మేపుకునే అవకాశం లేకుండా పోయిందని వారు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి సుమారు 1500 మంది

మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. జలాశయంలో చేపలు పెంచి వాటిని వేటాడుతూ జీవనం సాగిస్తున్నారు. జలాశయ గర్భంలో ఇప్పటికే వందలాది ఎకరాలు ఆక్రమణల పాలైంది. దీనికి తోడు

కొందరు వ్యాపారులు ప్రాజెక్టు భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఈ క్రమంలో జలాశయంలో భారీ గోతులు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో చేపల వేటకు వెళ్లిన

మత్స్యకారులు వీటి కారణంగా ప్రమాదాలకు గురవుతున్నారు. గత నాలుగేళ్లలో తాడువాయి, వేగవరం, ఎ.పోలవరం గ్రామాలకు చెందిన ఆరుగురు మత్స్యకారులు ఇలాంటి గోతుల్లో మునిగి మృతి చెందారు.

కరోనా నివారణకు ఉధ్యమించాలి

Tags: Everything is occupied

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *