పుంగనూరులో దీపావళి నోముల పండుగకు సర్వం సిద్దం
పుంగనూరు ముచ్చట్లు:
దీపావళి నోముల పండుగను ప్రజలు సోమవారం అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించేందుకు సిద్దమౌతున్నారు. పట్టణంలోని వీధులన్ని ప్రజలతో నిండిపోయింది. పట్టణంలోని బిఎంఎస్క్లబ్లో టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేశారు. అలాగే ఎంబిటి రోడ్డులో ప్రతి దుకాణం వద్ద నోముదారాల విక్రయాలు ఊపందుకుంది. మామిడి ఆకు, ఆరటివెహోక్కలు, పూలు, టెంకాయలు, నోముముడులు రోడ్లపై పెట్టి విక్రయాలు చేపట్టారు. టపాకాయల ధరలు అధికంగా ఉండటంతో ఈసారి వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉందని వ్యాపారులు అంటున్నారు. ప్రతి ఏటా దీపావళి పండుగ రోజు మహాలక్ష్మికి నోముల పండుగను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దుకాణాలు, కార్యాలయాలు, వాహనాలకు పూజలు నిర్వహిస్తారు. అలాగే నోములు పండుగ నిర్వహించేందుకు కుటుంబ సభ్యులందరు ఉదయం నుంచి మహాలక్ష్మీదేవి పూజల్లో పాల్గొని , బంగారు, వెండితో తయారు చేసిన నోముదారాలను కుడిచేతికి కట్టుకోవడం ఆనవాయితీ. అలాగే చక్కర , బెల్లం, బియ్యపు పిండితోఅతి రసాలను తయారు చేసి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, స్వీకరించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయాలలో పూజలు నిర్వహిస్తారు.

దీపావళి జాగ్రత్తలు పాటించాలి…
ప్రజలందరు దీపావళి పండుగను జాగ్రత్తగా నిర్వహించుకోవాలని తహశీల్ధార్ వెంకట్రాయులు సూచించారు. ఆదివారం టపాకాయల దుకాణాలను ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు, ఎస్ఐ మోహన్ కుమార్తో కలసి తనిఖీ చేశారు. దుకాణాల వద్ద మట్టి, ఇసుక తో పాటు ఫైర్ మిషన్లు పెట్టుకోవాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
Tags: Everything is ready for Diwali Nomula festival in Punganur
