మకరజ్యోతికి సదుం అయ్యప్ప దేవస్థానం లో సర్వం సిద్ధం

Date:13/01/2021

సదుం ముచ్చట్లు:

సంక్రాంతి సందర్బంగా ప్రత్యేక అలంకరణలో ముస్తాబవుతున్న శ్రీ కోటమల అయ్యప్ప ఆలయన్ని 1988 లో ఎనిమిది ఎకరాల స్థలం లో కేరళలోని శబరిమల ని తలపించే విధంగా ఆలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నీ సౌకర్యాలతో నిర్మించారు అయ్యప్ప ఆలయంలో కేరళలోని స్వామి కి జరిగే పూజలన్ని సంప్రదాయం ప్రకారం ఇక్కడ కూడా నిర్వహించునట్లు ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ నంబుద్రి తెలిపారు ఆలయం ప్రారంభం నుండి ఇక్కడే ప్రత్యక పూజా క్రమాలలో నిమగ్నమైన ప్రత్యేక పండితులు నంబుద్రి నారాయణ స్వామివారి పూజా కార్యక్రమాలన్ని దగ్గరుండి చూసుకుంటారు అయ్యప్ప అంటే పెద్దిరెడ్డి తో పాటు కుటుంబ సభ్యులకు అపారమైన భక్తి దీనితో ఆలయనిర్మాణం జరిగిన వెంటనే స్వామివారికి వజ్రాల ఆభరణాలను తయారు చేయిన్చారు వీటిని ఏడాదిలో జరిగే మకర జ్యోతి పర్వదినం రోజున అలంకరిస్తారు మకరజ్యోతి సందర్బంగా స్వామికి నిత్యం పూజా కార్యక్రమం లో భాగంగా బంగారు పూతతో చేసిన స్వామి ప్రతిమను మంత్రి అలంకరించారు ప్రతి రోజు మనరాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు మకర జ్యోతి రోజున అందరూ ఇరుముడులను స్వామి వారికి సమర్పిస్తారు ఇదే కాకుండా ప్రతి ఏటా ఆలయం లో నిత్యం మూడుపూటలా అన్నదానాన్ని నిర్వహిస్తారు యిక్కడ జరిగే అన్నీ కార్యక్రమాలను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే దగ్గర ఉండి పర్యవేక్షిస్తారు.ఆలయ ధర్మ కర్తపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్&గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు
ఎర్రాతివారిపల్లి సదుం మండలం పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా.

 

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags: Everything is ready for Makar Jyoti in the Sadum Ayyappa Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *