Everything is ready for the American election

అమెరికా ఎన్నిక‌లకు అంతా సిద్ధం

Date:30/10/2020

వాషింగ్ట‌న్‌ ముచ్చట్లు:

అగ్ర రాజ్యం ఎన్నికలు అంతర్జాతీయ సమాజానికి ఆసక్తి కలిగిస్తాయి. దాదాపు ఏడాది పాటు సాగే ఆ దేశ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి పట్టం కడుతుంది. అగ్రరాజ్య ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇతర దేశాల్లో మాదిరిగా అక్కడ ఎన్నికల తేదీ ప్రకటన అంటూ ఏమీ ఉండదు. నాలుగేళ్లకోసారి నవంబరు నెలలో వచ్చే మొదటి మంగళవారం ఎన్నికలు జరుగుతాయి. అదే విధంగా కొత్త అధినేత జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏ ఒక్క నాయకుడూ రెండుసార్లు మించి అధ్యక్ష పదవికి పోటీ చేయరాదు. ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో అంశాలు ఉన్నాయి.అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఎవరికీ అలాంటి అవకాశం రాలేదు. ఆయన పేరు మీదే రాజధాని ఏర్పాటైంది. ఆయన రెండుసార్లు అంటే 1789 నుంచి 1797 వరకు అత్యున్నత పదవిని నిర్వహించారు. రెండుసార్లకు మించి పోటీ చేయరాదన్న నిబంధనను ఆయనే ప్రతిపాదించారు. ఈ మేరకు 1951 ఫిబ్రవరిలో రాజ్యాంగానికి 22వ సవరణ చేశారు. తొలి ఉపాధ్యక్షుడు జాన్ ఆడమ్స్ . ఎన్నికలు నవంబరు మొదటి మంగళవారం నిర్వహించడానికి ఒక కారణం ఉంది. క్రైస్తవ దేశమైన అమెరికాలో ఆదివారం ప్రార్థనలతో ప్రజలు గడుపుతారు.

 

 

 

దీంతో ఆదివారానికి ముందు తరవాత ప్రజలు ఏ పనీ పెట్టుకోరు. మిగిలిన రోజుల్లో వ్యవసాయ పనులతో తీరిక లేకుండా ఉంటారు. అందువల్ల మంగళవారం అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో ఆ రోజును ఎంచుకున్నారు. ఎన్నికైన అధ్య క్షుడు జనవరి 20న బాధ్యతలు చేపడతారు.1933లో తీసుకువచ్చిన 20వ సవరణ ద్వారా ఇది అమల్లోకి వచ్చింది. అంతకుముందు అధ్యక్షులు మార్చి 4న ప్రమాణ స్వీకారం చేసేవారు. వాషింగ్టన్ లోని అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్ హౌస్ మెట్లమీద ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించేవారు. ఒక చేతిలో బైబిల్ పట్టుకుని కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేస్తారు. అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు ఫ్ల్రాంక్లిన్ ది రూజ్వెల్ట్. ఆయన మొత్తం నాలుగు సార్లు 1932 నుంచి నాలుగుసార్లు 1946 వరకు దేశాన్ని ఏలారు. 63వ ఏట పదవిలో ఉండగానే మరణించారు. రూజ్వెల్ట్ అనంతరం రెండుసార్లకు మించి పోటీ చేయరాదన్న నిబంధన 1951లఅమల్లోకి వచ్చింది. ఈ సవరణ అమల్లోకి వచ్చిన తరవాత రెండుసార్లు పనిచేసిన అధ్యక్షులు అయిదుగురే. డ్వైట్ ఐసెన్ హోవర్, రొనాల్డ్ రీగన్, క్లింటన్ జార్జిబుష్, బరాక్ ఒబామా మాత్రమే రెండుసార్లు చక్రం తిప్పారు.

 

 

 

అతి తక్కువ కాలం పని చేసిన అధినేత విలియమ్ హెన్రీ హారిస్. ఆయన కేవలం 31 రోజులు అంటే 1841 మార్చి 4 నుంచి ఏప్రిల్ 4 వరకు పాలన చేసి మరణించారు.అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థి 35 సంవత్సరాలు కలిగి ఉండాలి. జన్మత: దేశ పౌరుడై ఉండాలి. అమెరికాలో 14 సంవత్సరాల పాటు నివసించి ఉండాలి. ఒబామా తొలి ఆఫ్రో అమెరికన్ ప్రెసిడెంట్. అతి చిన్న వయసులో (35 సంవత్సరాలు) అధికార పగ్గాలు చేపట్టిన నేత జాన్ ఎఫ్ కెన్నడీ. అత్యధిక స్థానాలు గల రాష్ర్టం కాలిఫోర్నియా. ఇక్కడ 55 స్థానాలు ఉన్నాయి. అతి తక్కువ స్థానాలు కేవలం 3 గల రాష్రం అలస్కా. పదవిలో ఉంటూ 13 మంది అధ్యక్షులు కన్నుమూశారు. రెండు వందల సంవత్సరాల చరిత్ర గల అమెరికా రాజ్యాంగానికి ఇప్పటివరకు 27 సార్లు సవరణ చేశారు. 1992 మే 27న చివరి సవరణ చేశారు. సమానత్వం కోసం పాటుపడతామని చెప్పుకునే అమెరికాలో 1920 వరకు మహిళలకు ఓటుహక్కే లేదు. 19వ సవరణ ద్వారా వారికి ప్రాతినిధ్యం కల్పించారు. 26వ సవరణ ద్వారా 18 ఏళ్లకే యువతకు ఓటుహక్కు కల్పించారు. చెప్పకుంటూ పోతే ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి.

ప‌వ‌న్ కిం క‌ర్త‌వ్యం

Tags: Everything is ready for the American election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *