Natyam ad

వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం

కాణిపాకం ముచ్చట్లు:


కాణిపాకం.శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం  నుండి.ప్రారంభం.కానున్నాయి. ఉదయం వినాయక చవితి  సందర్భంగా ఆలయ అధికారులు అన్ని.ఏర్పాట్లను పూర్తి చేశారు… ఉదయం స్వామివారి కి అభిషేకాలు ,ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు…ఉదయం 4 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు…సెప్టెంబర్ 1 వ తేది స్వామి వారి బ్రహ్మోత్సవాలు  ధ్వజారోహణం తో ప్రారంభిస్తారు…9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు,11 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. వినాయక చవితి రోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు.ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్.లో త్రాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉండేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Tags: Everything is ready for the annual Brahmotsavam

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.