విద్యా వలంటీర్ల నియామాకానికి సిద్ధం

Date:13/07/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వాలంటీర్ల నియామాకానికి అంతా సిద్ధమైంది. ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లలో  చదివేందుకు విద్యార్థులకు అన్ని వసతులను కల్పిస్తున్న ప్రభుత్వం ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. నెల రోజులుగా ఉపాధ్యాయుల కొరతతో పాఠశాలలలో బోధన అంతంత మాత్రంగానే సాగింది. బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాలో అత్యధికంగా ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని తాత్కాలికంగా వలంటీర్లతో నింపడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. జిల్లాలో 744 ప్రాథమిక, 112 ప్రాథమికోన్నత. 175 ఉన్నత కలిపి మొత్తంగా 1,035 పాఠశాలలు ఉన్నాయి. బదిలీల తర్వాత 112 బడుల్లో ఒక్క ఉపాధ్యాయుడూ మిగలలేదు. ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, ఎల్‌.ఎఫ్‌.ఎల్‌. ప్రధానోపాధ్యాయులు కలిపి మొత్తంగా 1328 ఖాళీలు ఏర్పడ్డాయి. వివిధ సమస్యలతో మరో 47 మంది ఉపాధ్యాయులు దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నారు. ఇంత పెద్దమొత్తంలో ఖాళీలు ఉండటంతో పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు మొత్తం 1,375 మంది విద్యా వలంటీర్లను నియమించనున్నారు. ఈనెల 13 నుంచి 15 వరకు బీఎడ్‌, డీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు తేదీలను ప్రకటించింది. 17 వరకు ఆయా మండలాల్లోని ఎంఈఓలకు ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 18 వరకు ఎంఈఓలు ధ్రువపత్రాలను పరిశీలన పూర్తి చేస్తారు. ఈనెల 20 వరకు విద్యావలంటీర్ల నియామకం పూర్తి కానుంది.జిల్లాలో వలంటీర్లు గత విద్యా సంవత్సరం కంటే ఈసారి అధికమయ్యారు. ప్రధానంగా జిల్లా నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు అత్యధిక మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లడంతో ఎక్కువగా ఖాళీలు ఏర్పడ్డాయి. నిరుడు 918 వలంటీర్లను నియమించారు. అంటే 457 మందిని అధికంగా నియమించున్నారు.
విద్యా వలంటీర్ల నియామాకానికి సిద్ధంhttps://www.telugumuchatlu.com/everything-is-ready-for-the-appointment/
Tags; Prepare for the appointment of academic volunteers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *