Natyam ad

ఎన్నికలకు సర్వం సిద్ధం -ఆర్‌వో మధుసూదన్‌రెడ్డి

– పీవోలు, ఏపీవోలతో కలిపి 1650 మంది
– 265 పోలీంగ్‌ కేంద్రాలు
– సమస్యాత్మక కేంద్రాలు 100
– పోలీంగ్‌ పక్రియ వెబ్‌కాస్టింగ్‌తో

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

165 నియోజకవర్గమైన పుంగనూరులో పోలీంగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు ఆర్‌వో మధుసూధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌ ఆదేశాల మేరకు 265 పోలీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలీంగ్‌ కేంద్రంలో పీవో, ఏపీవో, ఓపీవోలతో కలిపి 6 మందిని నియమించామన్నారు. అలాగే అదనంగా సిబ్బందిని రిజర్వులో ఉంచుతామన్నారు. అలాగే 28 రూట్లు, 8 సెక్టార్‌ రూట్లు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో విద్యుత్‌, మంచినీరు, వసతి ఏర్పాట్లు పకడ్భంధిగా చేపట్టామన్నారు. అలాగే ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద బ్యారీకెడ్లు ఏర్పాటు చేసి క్యూ పద్దతిలో ఓటింగ్‌ పక్రియ నిర్వహించనున్నట్లు ఆర్‌వో తెలిపారు. అలాగే స్థానిక శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిస్టిబ్యూషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. అక్కడి నుంచి సిబ్బందిని పోలీంగ్‌ కేంద్రాలకు తరలిస్తామన్నారు. పోలీంగ్‌ ముగిసిన వెంటనే ఈవిఎంలతో పాటు నేరుగా చిత్తూరులోని ఎస్వీసెట్‌ కళాశాలకు బ్యాలెట్‌ బాక్సులను తరలిస్తామన్నారు. ఇందు కోసం అవసరమైన వాహనాలను, సిబ్బందిని సమకూర్చామన్నారు.

సమస్యాత్మక గ్రామాలు..

నియోజకవర్గంలో 100 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు ఆర్‌వో తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలోను వెబ్‌కాస్టింగ్‌తో పక్రియ నమోదు చేస్తామన్నారు. అలాగే 150 వీడియో గ్రాఫర్లను నియమించామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద 5 మంది పోలీసులను నియమిస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు , ఓటింగ్‌ పక్రియకు ఎలాంటి విఘాతం కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌వో తెలిపారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు శాంతియుతంగా పోలీంగ్‌ నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.

 

Tags: Everything is ready for the election – R.V. Madhusudan Reddy

 

Post Midle