అంతా రహస్యంగా ప్రచారం

Date:11/10/2018
నల్గొండ  ముచ్చట్లు:
ముందస్తు ఎన్నికల వేళ ప్రచార రహస్యాలను గోప్యంగా ఉంచుతున్న ప్రధాన పార్టీలకు చెందిన నేతలు చివరి నిమిషం వరకు తాము ఏ గ్రామంలో పర్యటిస్తున్నారో అన్న విషయాన్ని సైతం కార్యకర్తలకు వెల్లడించకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు వలసలను ప్రోత్సహిస్తూ తమ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు తటస్థులను తమ పార్టీలో చేర్చుకోవడంలో సఫలం కాగా బీజేపీ మాత్రం నేటికి ఇంకా ఈ ప్రక్రియను ప్రారంబించలేదు. కాగా ప్రధాన పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఎవరికి వారుగా తమ ప్రచారాలను ఉధృతం చేస్తూ ముందుకు సాగుతుండగా గ్రామాల్లో మాత్రం రాజకీయ వేడి ఇప్పటికే రాజుకుంది.
ఉదయం నుండి ప్రచారాల్లో నిమగ్నమయ్యే ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సాయంత్రం వేళ తాము రేపు తలపెట్టబోయే పనుల గురించి ముందుగా కార్యకర్తలకు వివరించకుండా ఉదయానే్న తమ కార్యక్రమాల వివరాలను వివరిస్తూ కార్యకర్తలు వెంటేసుకుని తిరుగుతున్నారు. కాగా బుధవారం నారాయణపేటలో కాంగ్రెస్ సంకీర్ణ మహాకూటమి తరఫున పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, కో-చైర్మన్ డికె అరుణ, కాంగ్రెస్ స్టార్ కంపెయనర్ విజయశాంతి స్థానిక సింగారం చౌరస్తా నుండి బైక్ ర్యాలీతో రోడ్‌షోను ప్రారంబించి పట్టణ పురవీధుల గుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ఏర్పాట్లు చేసి ఈ రోడ్‌షోను నారాయణపేట పట్టణం మొత్తం మీద సాగించి స్థానిక సత్యనారాయణ చౌరస్తాలో పార్టీ శ్రేణులు.
ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు బిజెపి మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సంకీర్ణ మహాకూటమి ఎత్తులను సునిశితంగా పరిశీలిస్తూనే విజయం కోసం అవసరమైన ఏర్పాట్లను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అభ్యర్థుల ఖరారు అనంతరం ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమైన బీజేపీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తమ ప్రచార రథాలతో ప్రచారాన్ని స్థానిక నేతల సహకారంతో కొనసాగిస్తోంది. ఏది ఏమైనా ఈ ఎన్నికలను అన్నీ ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకుని ముందుకు సాగుతుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటూ ప్రధాన పార్టీల రంగంలో నిలుచునే అభ్యర్థులు ఓటర్ల నాడిని పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
Tags:Everything is secretly advertised

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *