Natyam ad

మండుటెండలో మొరాయించిన ఈవిఎంలు, ప్రశాంతంగా పోలింగ్‌

-ఎండలో నిలుచున్న ఓటర్లు
-మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పుంగనూరు అసెంబ్లి ఎన్నికలు చెదురు ముదురు సంఘటనలు మినహా నియోజకవర్గంలో ప్రశాంతంగా సాగింది. సోమవారం పోలీంగ్‌ను ఆర్‌వో మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు ప్రారంభించారు. పట్టణంలోని కొత్తయిండ్లు హైస్కూల్‌లో సుమారు 2 గంటల సేపు ఈవిఎంలు మొరాయించడంతో ఓటర్లు కేంద్రం వద్ద భారులు తీరారు. మండుటెండలో నిలుచుకోవాల్సి వచ్చింది. అలాగే ప్యాలెస్‌ కాంపౌండులోని పోలీంగ్‌ స్టేషన్‌లో ఓటర్లకు వసతులు లేకపోవడంతో ఎండలో నిలుచుకోవాల్సి వచ్చింది. ఆవరణంలోనికి రాకుండ పోలీసులు, ఆర్‌వో గేట్లు వేయించడంతో మండుటెండలో ఓటర్లు ఆందోళనకు దిగారు. అదే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోలీంగ్‌ పరిశీలనకు ఆకేంద్రంకు చేరుకున్నారు. ఓటర్లు ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే ఆర్‌వో , పీవోలతో మాట్లాడారు. ఓటర్లను గంటలతరబడి ఎండలో ఎందుకు నిలబెట్టారని , వసతులు ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఓటర్లను ఆవరణంలోనికి అనుమతించారు. అలాగే పట్టణంలోని పలు పోలీంగ్‌ కేంద్రాలన మంత్రి పెద్దిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు మంత్రి అభివాదం చేశారు. అలాగే పలు ప్రాంతాలలో ఈవిఎంలు సక్రమంగా పనిచేయకపోవడంతో పోలీంగ్‌ ఆలస్యమైంది.

 

ఓట్లు వేసేందుకు వచ్చిన వృద్ధులు , వికలాంగులు….

ఓటు హక్కు వినియోగించుకునేందుకు వృద్ధులు, వికలాంగులు ఎంతో హుషారుగా పోలీంగ్‌ కేంద్రాలకు చేరుకుని ఓటు వేసి వెళ్లడం జరిగింది. ఒక మహిళా ఓటరు తన తల్లి, పిల్లలను వెంట తీసుకుని వచ్చి ఓటు వేశారు. ఉదయం నుంచి పోలీంగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

  

 

Tags; EVMs displayed in Mandutenda, peaceful polling

Post Midle