Natyam ad

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఈవో

తిరుచానూరు ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ ఈవో   ఎవి ధర్మారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆలయంలో ప్రస్తుతం ఉన్న ఐనామహల్, యాగశాలల స్థానంలో రాతి మండపం నిర్మించాలని అధికారులను ఆదేశించారు.ఆలయంలో ఉన్న ఎలక్ట్రికల్ కంట్రోల్ రూమ్ ను ఆలయం బయటకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు ఎస్పీ డీసీఎల్ అధికారుల సూచనలు తీసుకోవాలన్నారు. ఆలయంలో ఉన్న రేకుల షెడ్డు స్థానంలో వెలుతురు బాగా వచ్చేలా ఆధునిక షెడ్డు ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారపు తోటలో ఆధునీకరణ పనులు చేపట్టి నెయ్యి ట్యాంకు, పిండి మిల్లు, ఎలక్ట్రికల్ జనరేటర్, ఒకవైపు ఉండేలా అవసరమైన ప్రహరీ గోడను నిర్మించాలని సూచించారు. శుక్రవారపు తోటలో ఉన్న పురాతన బావి మరమత్తు పనులు వేగవంతం చేయాలన్నారు. ఇక్కడ ఉన్న మరుగుదొడ్లు, విద్యుత్ వైర్లను వెలుపలకు మార్చాలని ఆదేశించారు. శుక్రవారపు తోటలోని కోనేటి మండపానికి మరమ్మత్తులు చేసి అమ్మవారిఊంజల సేవ నిర్వహించాలని ఈవో ఆదేశించారు.

 

 

 

యాత్రికులు వేచి ఉండేందుకు పాత డిప్యూటీ ఈవో కార్యాలయ భవనం స్థానంలో నూతన భవన నిర్మాణానికి సాధ్యా సాధ్యాలను పరిశీలించి, సమగ్ర నివేదికను రూపొందించాలని చెప్పారు . ఆ తరువాత దీనిపై సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.అంతకుముందు ఈవో ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, పోటు, ఎలక్ట్రికల్ కంట్రోల్ రూమ్, శుక్రవారం తోటలోని నెయ్యి ట్యాంక్, ఫ్లోర్ మిల్, గ్యాస్ నిల్వ గది, హాట్ వాటర్ ప్లాంట్, నాలుగు మాడ వీధులు,
తోలప్ప గార్డెన్ పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈవో వెంట జేఈవో  వీరబ్రహ్మం, ఎఫ్ఎ సీఏఓ  బాలాజీ, సిఈ  నాగేశ్వరరావు, ఎస్ ఈ లు  సత్యనారాయణ , (ఎలక్ట్రికల్ ) వెంకటేశ్వర్లు, టీటీడీ సాంకేతిక సలహాదారు  రామచంద్రా రెడ్డి, డిప్యూటీ ఈవో  గోవిందరాజన్, ఈఈ  మనోహర్, ఏఈఓ  ప్రభాకర్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

 

Post Midle

Tags; EVO inspected the development works at Sri Padmavati Ammavari Temple

Post Midle