Natyam ad

బూంది పోటు యాంత్రీకరణపై ఈవో స‌మీక్ష‌

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

శ్రీ‌వారి ఆల‌య బూందీ పోటు యాంత్రీకరణపై శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి ఈవో  ఎవి ధర్మారెడ్డి స‌మీక్ష‌ నిర్వహించారు.ఈవోతోపాటు ముగ్గురు స‌భ్యులు గ‌ల క‌మిటీ క‌లిసి బూందీ తయారీలో యాంత్రీకరణ‌కు గ‌ల అవ‌కాశాల‌పై సెప్టెంబ‌రులో ప‌లు కంపెనీలతో సమీక్షించారు. చ‌క్కెర పాకం, బూందీ, పిండి త‌ర‌లింపు తదితర అంశాల‌పై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.కమిటీ సభ్యులు నరసింహమూర్తి,  జగన్నాథరావు,  శేష శైలేంద్ర, బాంబినో ఎండి సుబ్రహ్మణ్యం, హీట్ అండ్ కంట్రోల్ ఇండస్ట్రియల్ ఎక్విప్‌మెంట్, వేదిక్ ప్యాక్ సిస్టమ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.అంతకుముందు వివిధ సంస్థల ప్రతినిధులు తమ ఆపరేటింగ్ మెకానిజమ్‌లపై పవర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.ఈ స‌మీక్ష‌లో ఎస్ఇ-2   జగదీశ్వర్ రెడ్డి, ఇఇ  జగన్మోహన్ రెడ్డి, డిఇ (ఎలక్ట్రికల్)   రవిశంకర్ రెడ్డి, డెప్యూటీ ఈవో   హరీంద్రనాథ్, పోటు ఏఈవో  పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: EVO Review on Mechanization of Bundi Potu

Post Midle