`ఎవ‌రికీ చెప్పొద్దు` ట్రైల‌ర్‌ విడుద‌ల

`Do not tell anyone 'trailer released
 Date:16/03/2019
 క్రేజీ ఆర్ట్స్‌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బసవ శంకర్ దర్శకత్వంలో రాకేశ్‌ వర్రే, గార్గేయి యల్లాప్రగడ జంటగా నటించిన చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. రాకేశ్ వ‌ర్రీ ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. నిర్మాణ బాధ్య‌త‌లు కూడా నిర్వ‌హించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 22న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను స‌క్సెస్‌ఫుల్ హీరో శ‌ర్వానంద్ విడుద‌ల చేశారు. అనంత‌రం ఎంటైర్ యూనిట్‌కు శ‌ర్వానంద్ శుభాకాంక్ష‌లు తెలిపి.. సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌న్నారు.
హీరో, నిర్మాత రాకేశ్ వ‌ర్రే మాట్లాడుతూ – “మా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన శ‌ర్వానంద్‌గారికి థాంక్స్‌. టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్‌కు అంత‌కు మించిన రెస్పాన్స్ వ‌స్తుంది. ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో ఉన్న స‌మ‌స్య‌ను ఎంట‌ర్‌టైనింగ్ వేలో ద‌ర్శ‌కులు బ‌స‌వ శంక‌ర్‌గారు చ‌క్క‌గా హ్యాండిల్ చేశారు. సినిమా ఆద్యంతం అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది. మార్చి 22న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం“ అన్నారు.
డైరెక్ట‌ర్ బ‌స‌వ శంక‌ర్ మాట్లాడుతూ – “ఎంట‌ర్ టైనింగ్ మూవీ.. అందులో మేం చెప్పాల‌నుకున్న విష‌యాన్ని సునిశితంగా చెప్పాం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నాం. మా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన హీరో శ‌ర్వానంద్‌గారికి థాంక్స్‌“ అన్నారు.
రాకేశ్ వ‌ర్రే, గార్గేయి య‌ల్లాప్ర‌గ‌డ జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి సంగీతం:  శంక‌ర్ శ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీ:  విజ‌య్ జె.ఆనంద్‌, నిర్మాత‌:  రాకేష్ వ‌ర్రే, ద‌ర్శ‌క‌త్వం:  బ‌స‌వ  శంక‌ర్‌.
Tags:`evvariki cheppoddu ‘trailer released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *