Natyam ad

వైఎస్సార్‌సీపీకి తోడుగా మాజీ సైన్యం

పుంగనూరు ముచ్చట్లు:

ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని రెండవసారి గెలిపించాలని కోరుతూ మాజీ సైనికులు ఆదివారం ఇంటింటా ప్రచారం చేపట్టారు. సంఘ నాయకులు సిడి.కృష్ణప్ప, నానబాలగణేష్‌ , సుబ్రమణ్యం, శ్రీనివాసులు, రెడ్డెప్ప, వేణుగోపాల్‌, హరి మొదలి, బాబు, హనుమంతరెడ్డి, జవహార్‌, వికె.రెడ్డి ల ఆధ్వర్యంలో మేలుపట్ల, కొత్తపేట ప్రాంతాలలో పర్యటించారు. అలాగే మండలంలోని సుగాలిమిట్ట, చిన్నతాండ గ్రామాలలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారాలు చేశారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ విజయంతో గెలిపించాలని , రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ శరణ్‌, వైస్‌ఎంపీపీ సరోజమ్మ, ప్రభాకర్‌నాయక్‌, వేణునాయక్‌, శ్రీనివాసులు, బిటి. అతావుల్లా, రవిచంద్ర, శ్రీనివాసులురెడ్డి , మహేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Ex-Army with YSRCP

Post Midle