Natyam ad

శ్రీవారి దర్శనానికి టీటీడీ మాజీ బోర్డు సభ్యులు నిబంధనలు పాటించాలి

తిరుమల ముచ్చట్లు:

 

టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే వారి కుటుంబ సభ్యులతో (భార్య, పిల్లలతో ) శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం బోర్డు కల్పించిందని టీటీడీ ఛైర్మన్   భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.అయితే కొందరు మాజీ బోర్డు సభ్యులు ఈ నిబంధనకు విరుద్ధంగా తమ కుటుంబ సభ్యులతో కాకుండా ఇతరులను వెంట బెట్టుకొని శ్రీవారి దర్శనం కొరకు పదే పదే రావడం మంచి పద్ధతి కాదని ఆయన ఆన్నారు. మాజీ బోర్డు సభ్యులు ఆ హోదాలో కేవలం వారి కుటుంబ సభ్యులతో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలే తప్ప, ఇతరులను వెంట బెట్టుకుని వస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారి దర్శనానికి అనుమతించేది లేదని ఆయన అన్నారు.

 

Post Midle

Tags:Ex-board members of TTD should follow the rules for darshan of Srivari

Post Midle