మాజీ మంత్రి దేవినేని ఉమా హౌస్ అరెస్ట్

విజయవాడ ముచ్చట్లు:


రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, దళిత మహిళలపై అత్యాచారాలకు నిరసనగా, వైసిపి ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాల సాధన కోసం టిడిపి ఎస్సిసెల్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్.రాజు ఆధ్వర్యంలో ఈ రోజు మంగళవారం విజయవాడలో దళిత గర్జన నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేసారు.
దేవినేని మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిందని, దళితులపై దాడులు నిత్వకృత్యమయ్యాయి. మూడేళ్ళ పాలనలో జగన్ ఎస్సీలకు మొండి చేయి చూపించారు. దళితుల కోసం కేటాయించిన వేలకోట్ల సబ్ప్లాన్ నిధులను వైసీపీ పాలకులు దారిమళ్లించారు. తిరిగి ఆనిధులన్నింటినీ రాబట్టి దళితుల సంక్షేమానికి కేటాయించాలి. నిలిపివేసిన బ్యాంకు లింకేజీ రుణాలను వెంటనే పునరుద్ధరించాలి. ఎస్సీల కోసం గతంలో అమలు చేసిన భూమి కొనుగోలు పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దళిత బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వాలు అమలు చేసిన బెస్ట్ అవైలబుల్, అంబేడ్కర్ విద్యా స్కీంలను జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసింది.  కేంద్రం ఇచ్చే పథకాలన్నింటినీ కాలరాచింది. దళితులంతా చైతన్యవంతులై జగన్ సర్కార్ పై సమరశంఖం పూరించాలని అన్నారు.

 

Tags: Ex-minister Devineni Uma house arrest

Leave A Reply

Your email address will not be published.