Natyam ad

మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర కు బ్రేక్

అనంతపురం ముచ్చట్లు:


రైతు కోసం- తెలుగు దేశం పేరుతో సోమవారం జరగాల్సిన పాదయాత్రను పోలీసు అధికారులు విజ్ఞప్తి మేరకు మాజీ మంత్రి పరిటాల సునీత  పాదయాత్ర రేపటికి వాయిదా పడింది. పాదయాత్రకు మొదటి నుంచి అడ్డంకులు సృష్టిస్తున్నారని సునీత  పేర్కొన్నారు.. సోమవారం రాప్తాడు మండలం గాండ్లపర్తి నుంచి అయ్యవారిపల్లి, రాప్తాడు వరకు 15 కి.మీ. మేర పాదయాత్ర చేయాలని రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. స్పందన కార్యక్రమం ఉండటంతో పోలీసులు చేసిన విజ్ఞప్తి మేరకు వాయిదా వేశామని పేర్కొన్నారు. మంగళవారం యథాతథంగా యాత్ర కొనసాగిస్తామన్నారు. ఒక్కోసారి ఓ కారణంగా సాకు చూపుతూ అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. డీఎస్పీ ప్రసాదరెడ్డిని అనుమతి కోరగా ఆయన వద్దని సూచించడంతో ఒక రోజు వాయిదా వేశామన్నారు. గతంలో కనగానపల్లి, రామగిరి మండలాల్లో ఇలాగే అనుమతుల విషయంలో జాప్యం చేస్తూ వచ్చారని విమర్శించారు.

 

Tags; Ex-Minister Paritala Sunitha broke the padayatra

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.